కృష్ణా: గుడ్లవల్లేరు కౌతవరం గ్రామంలో రైల్వే స్టేషన్ రహదారి వద్ద ఉన్న విద్యుత్ పోల్ ప్రమాదకరంగా మారిందని బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయ దేవాలయం పక్కన ఉన్న ఈ ట్రాన్స్ ఫార్మర్ తీగలు బయటకు కనిపిస్తూ, పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు చేతికి అందేలా ఉన్నాయని స్థానికులు తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి వాటిని తొలగించాలన్నారు.