తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU)కి ఉన్నత విద్యా కమిషన్ రూ. 15లక్షల ఫైన్ వేసిన విషయం తెలిసిందే. అయితే MBU గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇప్పటికే ఫైన్ కట్టేసిన MBU.. విద్యార్థులకు తిరిగి రూ.26 కోట్లు చెల్లించాలన్న ఆదేశాలపై కోర్టుకు వెళ్లింది. స్టే విధించిన కోర్టు విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.