NLG: అనుముల మండలం పేరూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో సోమ సముద్రంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో చెరువు కత్వ నుంచి ఉప్పొంగిన వరద నీరు హాలియా-పేరూరు రహదారిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండలంలోని పేరూరు, ఆంజనేయతండా, పుల్లారెడ్డిగూడెం, వీర్లగడ్డతండా గ్రామాలకు, మండలకేంద్రమైన హాలియాకు రాకపోకలు నిలిచిపోయాయి.