NLR: ఉలవపాడు పోలీస్ స్టేషన్ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. గాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడటంతో పాటు ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని SI అంకమ్మను ఆదేశించారు.