యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ముంబైకి చేరుకున్నారు. బ్రిటన్ ప్రధానిని మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, సీఎం ఫడ్నవీస్ ఘనంగా స్వాగతించారు. వీరితో పాటు Dy CMలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్, సహా ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా ఆయనకు స్వాగతం పలికారు. భారత్-యుకే సంబంధాల బలోపేతానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఇరు దేశాల అధికారులు భావిస్తున్నారు.