ATP: పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్ నుంచి త్వరలో అమ్మలదిన్నె కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు. మండలంలోని అమ్మలదిన్నెలో పర్యటించిన ఆయన ఈ మేరకు ప్రకటించారు. అలాగే ముచ్చుకోట రిజర్వాయర్‌కు నీరిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిపారు.