కృష్ణా: గుడివాడ పట్టణంలో లైసెన్స్ పొందిన ఫైర్ క్రాకర్స్ విక్రయ కేంద్రాలను టూ టౌన్ సీఐ హనీష్ నిన్న పరిశీలించారు. దుకాణాల లైసెన్సులు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, హైడ్రంట్ల పనితీరును పర్యవేక్షించారు. భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యాపారులను ఆయన ఆదేశించారు.