ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల హైవేలో బుధవారం ఉదయం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. వర్షం కారణంగా రోడ్డు జారుడుగా మారడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు, వాహనానికి స్వల్ప నష్టం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.