మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోకు దసరా పండుగ కలిసి వచ్చింది. రీజియన్ పరిధిలోనే 102 ఆక్యుపెన్సి నమోదు చేసి రూ. 5,24,59,065/- రూపాయల ఆదాయాన్ని పొందిందని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. రెండవ స్థానంలో వనపర్తి, ఆ తర్వాత స్థానాల్లో కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, షాద్ నగర్, కోస్గి ఉన్నాయన్నారు.