NZB: డిచ్పల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం ఏసీపీ రాజా వెంకటరెడ్డి తనిఖీ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై షరీఫ్ సిబ్బంది ఉన్నారు.