BDK:షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ కొత్తగూడెం పట్టణ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవ్వాయ్పై కాలు బూటుతో జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.