కృష్ణా: గుడివాడలోని నలందా మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీపై ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు రహదారులపై నిబంధనలు పాటించాలని సూచించారు.హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం, మైనర్లు వాహనాలు నడపకూడదని చెప్పారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు.