KDP: ఉల్లి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి విమర్శించారు. మంగళవారం మైదుకూరు నియోజకవర్గంలోని కృష్ణాపురం, తిప్పిరెడ్డిపల్లి, అక్కులయ పల్లె గ్రామరైతులను ఆయన కలిసి ఉల్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా, క్వింటా రూ.1200 కొంటామని, హెక్టారుకు రూ.50,000 అందిస్తామని ప్రభుత్వం ఎక్కడ చేసిందన్నారు.