NTR: రామాయణాన్ని మహా అద్భుత కావ్యంగా మలిచి జాతికి సన్మార్గాన్ని నిర్దేశించిన మహోన్నత వ్యక్తి మహర్షి వాల్మీకి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాల్మీకి మహర్షి రామాయణంలో దాదాపు 24 వేల శ్లోకాలు రాశారని కొనియాడారు.