KRNL: కుప్పగల్లులో మంగళవారం వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ జెడ్పీ ఛైర్మన్ తిక్కన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు వెంకన్న, నీలకంఠప్ప, సూర్పరాజు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.