ATP: గుత్తి మున్సిపాలిటీలోని 15వ సచివాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సచివాలయం వచ్చిన ప్రజలకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.