AP: ఇవాళ వాల్మీకి జయంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ఆయన ఫొటోకు నివాళుర్పించారు. ప్రపంచానికి రామాయణ ఇతిహాసాన్ని అందించిన మహర్షి, వేటగాడైన వాల్మీకి రామనామాన్ని జపిస్తూ.. మహర్షిగా మారిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అని ఎక్స్‌లో పోస్టు పెట్టారు.