KNR: రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన బందారపు తిరుపతి గౌడ్ కుమార్తె ఆమని గ్రూప్-2 పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఎంపీఓ ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా చొప్పదండి MLA డాక్టర్ మేడిపల్లి సత్యం సోమవారం ఆమనిని అభినందించి శాలువాతో సన్మానించారు. ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి ఎదిగి విజయం సాధించాలని ఆయన ఆశీర్వదించారు.