బాపట్ల: రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పద బ్యాగ్ కనిపించడంతో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న SHO రాంబాబు వెంటనే సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. బ్యాగును తనిఖీ చేయగా, అందులో బట్టలు మాత్రమే ఉన్నట్లు తేలింది. అది ఇమ్మడిశెట్టివారి పాలెంకు చెందిన అంకిరెడ్డి నాగరాజుదిగా గుర్తించారు. పోలీసులు స్పందించడం పట్ల స్థానికులు అభినందించారు.