AP: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గడ్డంవారిపల్లిలో ఇటీవల మృతిచెందిన టీడీపీ సీనియర్ నేత, ఉమ్మడి చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్ పల్లినేని సుబ్రహ్మణ్యంనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. సుబ్రహ్మణ్యం చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.