MHBD: రాష్ట్ర నూతన డీజీపీ శివధర్ రెడ్డిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీకి పూలమొక్క అందజేసి ఇటీవల బాధ్యతలు స్వీకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లాలో పోలీస్ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి ఎస్పీ డీజీపీకి వివరించారు.