NLR: ఉదయగిరి దుర్గం వెళ్లే కూడలి వద్ద నిన్న రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని చుక్కల దుప్పికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన చుక్కల దుప్పిని పశువైద్యశాలకు తరలించారు. చుక్కల దుప్పి వెనుక తొడ వైపు వాహనం బలంగా ఢీ కొట్టింది. చికిత్స అనంతరం ఉదయగిరి అటవీ ప్రాంతంలోకి చుక్కల దుప్పిని వదిలివేశారు.