ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ను ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధికారులు పట్టణంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీస్ అధికారులపై దాడి చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటుందని SP తెలిపారు.