JN: జనగామ జిల్లా కొడకండ్ల మండలం చెరువు ముందు తండాలో ధరావత్ రేఖ్య నాయక్ (65) అనే వృద్ధుడు సోమవారం రాత్రి ఉరి వేసుకుని మృతిచెందాడు. అట్టి వృద్ధుడు కిడ్నీ సమస్యతో కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కిడ్నీ నొప్పి భరించలేక ఉరి వేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.