నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ.. ప్రజా ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించరాదని, ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.