W.G: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అత్తిలి మండలంలో అండర్ 14, 17 బాలురు, బాలికల అథ్లెటిక్స్ పోటీలు జరగనున్నాయి. ఈనెల 8, 9 తేదీల్లో అత్తిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు మండల ఎసీఎఫ్ కోఆర్డినేటర్ దిలీప్ కుమార్ సోమవారం తెలిపారు. అథ్లెటిక్స్, చదరంగం, కబడ్డీ, ఖోఖో, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, యోగా తదితర మండల స్థాయి పోటీలు జరుగుతాయి.