NLG: అక్టోబర్ 9న హజరత్ సయ్యద్ లతీఫ్ షావలి దర్గాలో జరగనున్న ఉరుసు-ఎ-షరీఫ్ ఏర్పాట్లపై డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం సమీక్షించారు. ఉరుసు కమిటీ సభ్యులు, దర్గా ఇనాంధారులతో ఆయన చర్చించారు. ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని ఆదేశించిన డీఎస్పీ, పోలీస్ శాఖ నుంచి అన్ని రకాల సహకారాలు అందిస్తామని తెలిపారు.