ASF: నేడు వీరయోధుడు కొమరం భీం వర్ధంతి. ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్, నిజాం పాలనలపై పోరాడిన వీరుడు. “జల, జంగల్, జమీన్” అనే నినాదంతో గిరిజనుల హక్కులను కాపాడేందుకు ఆయన ఉద్యమం నడిపారు. 1940లో నిజాం సేనల చేతులలో అమరుడైన భీం స్మృతి ప్రాంగణాల్లో నివాళులు అర్పిస్తూ ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు సంస్మరిస్తున్నాయి. ఆయన త్యాగాలు కొత్త తరానికి స్ఫూర్తిదాయకం.