PPM: కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సత్వర చర్యలు అమోఘమని కురుపాం మండలం శివ్వన్న పేట గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు అనారోగ్యానికి గురైన విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ అర్ధరాత్రి హుటాహుటిన అంబులెన్స్ పంపించి ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారన్నారు.