SKLM: సంతబొమ్మాళి (M) జగన్నాథపురానికి చెందిన చందు టెన్త్ చదువుతున్నాడు. ఈ నెల 5వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. బంధువులు, తెలిసినవాళ్లు చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తల్లి పుష్ప సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విద్యార్థి గుండుతో ఉండి, తెల్లని ప్యాంటు, ఆకుపచ్చ టీషర్ట్ వేసుకున్నాడని ఆనవాళ్లు చెప్పింది.