KDP: చాపాడు మండలంలో భార్యపై అనుమానంతో భర్త వినోద్ కుమార్ ఆమెపై కత్తితో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిపై పలు కేసులు, రౌడీషీటు ఉన్నాయని, సోమవారం అతన్ని అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించినట్లు ఎస్సై చిన్న పెద్దయ్య తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.