అన్నమయ్య: పీలేరు పట్టణానికి చెందిన అనురాధ అనే మహిళ, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పీఏ సత్య, అతని బంధువు మనోహర్ తన స్థలాన్ని కబ్జా చేసి, ప్రహరీని కూలగొట్టి, చంపేస్తామని బెదిరిస్తున్నారని సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. MNR గార్డెన్స్ ఎదురుగా ఉన్న తన 38 అంకణాల స్థలంలో బోరు వేయించి, ప్రహరీ కట్టించానని, దానిని కూలగొట్టి స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఆమె తెలిపారు.