CTR: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి నేడు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్టీ జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం చిత్తూరులో చలో విజయవాడ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 12వ పీఆర్సీ ఏర్పాటు చేయాలని నేతలు కోరారు.