ELR: చాట్రాయి మండలం పర్వతాపురం వనసంరక్షణ సమితిలో రూ. 40లక్షలకు సంబంధించిన లెక్కలు తేల్చాలని అదే ఊరికి చెందిన రమణ బ్రహ్మ అనే వ్యక్తి డిమాండ్ చేశాడు. ఈ మేరకు నూజివీడు సబ్ కలెక్టర్కు అర్జీ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. వన సంరక్షణ సమితి సభ్యులకు తెలియకుండా, గ్రామసభ నిర్వహించకుండా నిధులు గోల్మాల్ చేశారని ఆరోపించారు.