శత్రు జలాంతర్గాముల ఉనికిని పట్టేసే యుద్ధనౌక ‘INS అండ్రోత్’ భారత నౌకాదళంలో చేరింది. విశాఖ నేవల్ డాక్‌యార్డ్‌లో వైస్ అడ్మిరల్ రాజేష్ ఆధ్వర్యంలో ఈ రెండో ‘యాంటీ-సబ్‌మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్’ కమిషనింగ్ జరిగింది. GRSE సంస్థ దీన్ని రూపొందించగా, లక్షదీవుల్లోని అండ్రోత్ అనే దీవి పేరును దీనికి పెట్టారు.