MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో పారిశుద్ధ్యాన్ని కాపాడటంలో మున్సిపల్ కార్మికుల సేవలో ప్రశంసనీయమని మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు యూనిఫామ్స్ అందజేశారు. మున్సిపల్ కార్మికులు తెల్లవారుజాము నుంచి పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారని ఆయన అన్నారు.