కోనసీమ: ద్వారపూడిలోని శ్రీ చేకూరి కాశీ విశ్వనాథరాజు జడ్పీ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు నాగళ్ల శ్రీనివాసరావు జాతీయ స్థాయి శిక్షణకు ఎంపికయ్యారు. సహజ, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో పాఠశాల పాత్ర అనే అంశంపై ఈ నెల 7 నుంచి 16 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో గల ప్రాంతీయ సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం (సీసీఆర్టీ) నిర్వహించే శిక్షణలో ఆయన పాల్గొంటారు.