సుప్రీంకోర్టులో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. సీజేఐ గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించారు. సీజేఐపై చెప్పు విసిరేందుకు లాయర్ ప్రయత్నించారు. దీంతో తోటి లాయర్లు ఆయన్ను అడ్డుకున్నారు. సనాతన ధర్మాన్ని అవమానించారని సదరు లాయర్ నినాదాలు చేశారు. అయితే, ఇలాంటి దాడులకు భయపడేది లేదని సీజేఐ తేల్చిచెప్పారు.