W.G: తాడేపల్లిగూడెంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు మునియ్య మృతి చెందడంతో ఆయన బంధువులు, సహచర కార్మికులు ప్రైవేటు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మునియ్య మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా అడ్డుకున్నారు. మునియ్యను వేధించిన శానిటరీ ఇన్స్పెక్టర్, సచివాలయ కార్యదర్శిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.