Kotak Mahindra CEO Uday Kotak:అమెరికా డాలర్ (US DOLLAR) గురించి కోటక్ మహీంద్రా (Kotak mahindra) సీఈవో అండ్ ఎండీ ఉదయ్ కోటక్ (uday kotak) హాట్ కామెంట్స్ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాది డాలరేనని అన్నారు. ఈటీ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్-2023 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మన వద్ద ఉన్న డబ్బు నాస్ట్రో (nastro) అకౌంట్లలో ఉందని ఉదయ్ కోటక్ (uday kotak) తెలిపారు. అమెరికాలో ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. రిజర్వ్ కరెన్సీకి (reserve currency) ఉన్న శక్తి అదేనని చెప్పారు. ఈ సిచుయేషన్ నుంచి బయటపడేందుకు ప్రపంచం ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తోందని తెలిపారు.
రూపాయిని (repee) రిజర్వ్ కరెన్సీగా మార్చే అవకాశం భారత ముందు ఉందన్నారు. వందేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఛాన్స్ ఇది అని చెప్పారు. ప్రస్తుతం విదేశీ వాణిజ్యం అంతా డాలర్లలో జరుగుతోంది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ వద్ద ఉన్న విదేశీ నగదును డాలర్ల రూపంలో నిల్వ చేస్తాయి. డాలర్‌ను రిజర్వ్ కరెన్సీ అంటారు. ఈ మొత్తాన్ని కేంద్ర బ్యాంకులు నాస్ట్రో అకౌంట్లలో ఉంచుతాయి. ఆ అకౌంట్లపై ఆంక్షలు విధించే అవకాశం అమెరికాకు ఉందని ఉదయ్ కోటక్ (uday kotak) అంటున్నారు.
సో.. ప్రస్తుతం మన ముందు ఉన్న అవకాశం రూపాయిని.. రిజర్వ్ కరెన్సీగా మార్చడమే. అందుకోసం భారత్ ప్రయత్నం చేయాలని నిపుణులు కోరుతున్నందున.. భారత ప్రభుత్వం అందుకోసం తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.