KRNL: ఆదోని పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంపై ఉన్న పీఓపీ ఆదివారం కూలిపోయింది. వర్షపు నీరు లీకై పైకప్పులోకి చేరడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు, ఘటన సమయంలో ఎవరూ భవనంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవనంలోని లోపాలపై అధికారులు వెంటనే దృష్టి సారించి, మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.