ప్రకాశం: కనిగిరి పట్టణంలోని పలు లాడ్జిలలో సోమవారం తెల్లవారుజామున ఎస్సై మాధవరావు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా లాడ్జిలో బస చేసిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే లాడ్జి యజమానులను బాధ్యులను చేస్తామని ఎస్సై హెచ్చరించారు. లాడ్జిలలో అనుమానితుల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలపాలన్నారు.