GNTR: తెనాలి-పెదరావూరు మార్గంలో వైకుంఠపురం వద్ద సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. ఒక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు 108లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.