పశ్చిమబెంగాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా డార్జిలింగ్‌లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమత పర్యటించనున్నారు.