KRNL: లీగల్ మెట్రాలజి డిప్యూటీ కంట్రోలర్ చల్లా దయాకర్ రెడ్డి, వ్యాపారులు ప్రతి సంవత్సరం ఎలక్ట్రానిక్ కాటాలు, 2 సంవత్సరాలకు ఒకసారి తక్కెడలు, తూనిక రాళ్లకు ముద్రలు వేయించుకోవాలని స్పష్టం చేశారు. ఆదివారం కర్నూలు సీ. క్యాంపు రైతు బజార్, పండ్ల మార్కెట్లలో తనిఖీ చేసి, తూకాల్లో మోసాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.