JN: దేవరుప్పుల మండల కేంద్రంలో అంతిమ యాత్రకు ఉపయోగించే వాహనానికి ఉన్న 4 టైర్లను గత 4 నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అప్పటి నుండి ఇప్పటివరకు ఆ వాహనం అలాగే ఉంది. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే అంతిమ యాత్రకు ఇబ్బంది అవుతుందని, దాతలు ముందుకు వచ్చి చక్రాలు బిగించి ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరారు.