KNR: గంగాధర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు తహశీల్దార్ అంబటి రజిత తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. మండల ప్రజలు గమనించాలని కోరారు.