KNR: సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి పెట్టి గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని చొప్పదండి మండలం గుమ్లాపూర్ వైద్యాధికారి డాక్టర్ అరుణ తెలిపారు. ఆదివారం ఇద్దరు మహిళలకు సాధారణ ప్రసవాలు జరిగాయని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె చెప్పారు. ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సేవలు, మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.