SRPT: ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త మొలగూరి గోపయ్య ఆదివారం తెలిపారు. మేళ్లచెరువు మండలం ఎర్రగట్టు తండాలో సోమిరెడ్డి వెంకటరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన సందర్శించారు. వెంకట్ రెడ్డి 20 ఏళ్లుగా 1.50 ఎకరాలలో ఎలాంటి రసాయన మందులు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని గోపయ్య అభినందించారు.