PDPL: అంతర్గాం మండలం ముర్మూర్ మిషన్ భగీరథ పంప్ హౌస్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సమ్మెలో ఉన్న కార్మికులను కలిసిన సీఐటీయూ నాయకులు వారికి తమ మద్దతు ప్రకటించారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు.